జూనియ‌ర్ ఎన్టీఆర్.. మ‌రోసారి ఆదే త‌ప్పు చేస్తాడా..?

Saturday, November 17th, 2018, 04:30:43 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు వాడ‌కానికి బ‌లైన వారిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. 2009లో తార‌క్‌ను ప్ర‌చారానికి వాడుకొని, ఎక్క‌డ లోకేష్‌కి అడ్డు త‌గులుతాడేమో అని ఎన్టీఆర్‌ను సైడ్ చేసి, మ‌రోసారి పార్టీ మాట ఎత్త‌కుండా తొక్కిప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత క్ర‌మంలో ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల రిలీజ్ విష‌యంలో కూడా టీడీపీ గ్యాంగ్ ఎన్ని ఆటంకాలు సృష్టించారో కూడా తెలిసిందే. ఈ విష‌యం ఇప్పుడు ఎన్టీఆర్ లైట్ తీసుకున్నా ఆయ‌న అభిమానులు మాత్రం అంత తేలిక‌గా తీసుకోరు.

అయితే గ‌తంలో కంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీతో సాన్నిహిత్యం పెరిగిన మాట వాస్తవమే అయినా.. నారా వారికి మాత్రం ఎన్టీఆర్ పై చిన్న చూపే ఉంది. ఎక్క‌డ లోకేష్‌కు పోటీ వ‌చ్చేస్తాడేమో అని చంద్ర‌బాబు ఒక క‌న్నేసి ఉంచిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో నందమూరి ఫ్యామిలీకి తాను వ్య‌తిరేకం కాద‌ని నంద‌మూరి అభిమానుల‌కు సంఖేతాలు పంపించాడు. ఈ క్ర‌మంలో దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినిని ఎన్నిక‌ల బరిలోకి దింపి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు బాబు.

అయితే ఈ క్ర‌మంలో ఈరోజే సుహాసిని నామినేష‌న్ వేసింది. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్‌రామ్, జూరియ‌ర్ ఎన్టీఆర్‌ల నుండి ఆమె గెలుపు ఆకాంక్షిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మ‌రి తార‌క్‌కు నాడు టీడీపీలో జ‌రిగిన అవ‌మానాలు అన్ని మ‌ర్చిపోయి సోద‌రి సుహాసిని కోసం టీడీపీ త‌రుపున ప్ర‌చారంలోకి దిగుతాడా.. నాడు చంద్ర‌బాబు కుటిల రాజ‌కీయాల‌కు బ‌లి అయిన ఎన్టీఆర్ మ‌రో సారి అదే త‌ప్పు చేస్తారా.. ఇప్పుడు ఇదే విష‌యం పై ఎన్టీఆర్ అభిమానులు కాకుండా స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఎన్నిక‌లు స‌మ‌యం దూసుకొస్తున్న త‌రుణంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల‌ని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.