అభయ్ ను ఎవరు కాపాడలేరు: ఎన్టీఆర్

Sunday, June 10th, 2018, 12:30:01 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత తన ఫ్యామిలీకి సంబందించిన హ్యాపీ మూమెంట్స్ ను అభిమానులతో తెగ షేర్ చేసుకుంటున్నాడు. ఏ చిన్న క్రేజీ మూమెంట్ అయినా సరే తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సరదాగా వైరల్ అయ్యేలా చేస్తుంటాడు. ఇక తన గారాల తనయుడు అభయ్ రామ్ కి సంబందించిన పోటోలను కూడా ఎన్టీఆర్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాడు. రీసెంట్ గా షేర్ చేసుకున్న ఫోటో కూడా నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. సింపుల్ గా అభయ్ పాలు తాగుతున్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం కామెంట్ వేరే విధంగా పెట్టాడు. రోజు తాగాల్సిన పాల కోటాకు సంబందించిన విషయంలో అభయ్ ను వాళ్ల అమ్మ నుంచి ఎవ్వరూ కాపాడలేరు అంటూ ట్వీట్ చేశారు. ఇక కమెడియన్ వెన్నెల కిషోర్ ఆ ఫోటోకి క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ట్వీట్‌ రీ ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments