అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారో రేపు తెలిసిపోద్దా..?

Thursday, December 6th, 2018, 07:01:17 PM IST

రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కలయికలో భారీ మల్టీస్టారర్ చిత్రంగా RRR చిత్రం రాబోతుంది.అయితే ఈ చిత్రంలోని రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు సరికొత్త లుక్ తో దర్శనమివ్వబోతున్నారని రాజమౌళి తెలిపారు.అయితే గత కొద్ది రోజుల నుంచి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ లుక్ పట్ల సోషల్ మీడియాలో ఒక పెద్ద గందరగోళమే నడుస్తుంది.ఎన్టీఆర్ మళ్ళీ లావైపోయారని,సినిమా కోసమే తన బరువు పెంచే పనిలో ఉన్నారని,అసలు ఎన్టీఆర్ మళ్ళీ లావు కాలేదని,రకరకాల పుకార్లు నెట్టింట్లో షికార్లు కొట్టాయి.

వాటితో పాటు ట్రోల్ల్స్ కూడా చాలానే తారక్ యొక్క అభిమానులు ఎదుర్కొన్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులు తమ అభిమాన హీరోని విమర్శించిన వారికి మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.రేపు తెలంగాణలోని ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే,ఇక్కడికి ఓటు వెయ్యడానికి తారక్ వస్తాడు కదా అప్పుడు అసలైన క్లారిటీ వస్తుంది అప్పటి వరకు ఆగండి అంటూ తారక్ యొక్క అభిమానులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.అది కూడా ఒక రకంగా నిజమే ఇన్ని రోజులు నుంచి వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే తారక్ బయటకి రావాల్సిందే.