జూనియర్ ఎన్టీఆర్ నటన, క్రమశిక్షణ ఇష్టమంటున్న ఎంపీ!

Sunday, July 29th, 2018, 11:20:32 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఆయనకు దేశ విదేశాల్లోనూ, అలాగే జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మన ఎన్టీఆర్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. అయితే కొందరు రాజకీయ నాయకులూ కూడా తమ ఫేవరెట్ నటీనటుల గురించి అక్కడక్కడా ప్రస్తావించడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం ఒక యువ టీడీపీ ఎంపీ
తనకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాల ఇష్టమని అంటున్నారు. ఆయన మరెవరో కాదు దివంగత టిడిపి సీనియర్ నాయకులూ ఎర్రన్నాయుడు గారి కుమారుడు మరియు ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీ గా పని చేస్తున్న రామ్ మోహన్ నాయుడు.

తన అభిరుచుల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ తనకు బాస్కెట్ బాల్ మరియు క్రికెట్ అంటే చాల ఇష్టమై, అవి ఆడమంటే ఎప్పుడైనా ఆడదానికి తాను సిద్ధమని అన్నారు. సినిమాలు కూడా బాగా చూస్తానని, మన తెలుగు నటులలో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఒక నటుడిగా మొదటి నుండి అయన ఎదిగిన క్రమం, అలానే క్రమశిక్షణ, నటనలో పలికే హావభావాల వల్లనే ఆయన అంత అద్భుత పేరు గడించారని రామ్ మోహన్ నాయుడు చెపుతున్నారు. ఇక హిందీ హీరోల్లో అమీర్ ఖాన్ అంటే తనకు ఇష్టమని, అలాగే ట్రావెలింగ్ ఇష్టమని, తనకు ఇష్టమైన ప్రదేశాల్లో న్యూ యార్క్ సిటీ మరియు భరత్ లోని హిమాలయాలు తన ఫేవరెట్ అని చెప్పారు….

  •  
  •  
  •  
  •  

Comments