పిరాయింపు ఎమ్మెల్యే షాకింగ్ డెసీష‌న్.. ఆ నియోజ‌క‌వ‌ర్గం మ‌ళ్లీ వైసీపీ ఖాతాలోకేనా..?

Thursday, March 14th, 2019, 04:07:46 PM IST

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొంది టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా పార్టీ కండువా మార్చిన ఎమ్మెల్యే తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారిగా రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయా..? ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మ‌ళ్లీ ఎగ‌ర‌నుందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. ఇంత‌కీ వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఆ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణ‌యం ఏంటి..? మ‌ళ్లీ వైసీపీ ఖాతాలో చేర‌నున్న ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

అయితే, 2014 ఎన్నిక‌ల రిజ‌ల్ట్ అనంత‌రం చోటు చేసుకున్న‌ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌త్తిపాడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై గెలుపొందిన వ‌రుపుల సుబ్బారావు సీఎం చంద్ర‌బాబు స‌మక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేశారు. కాసేప‌టి క్రితం ప్ర‌త్తిపాడులో త‌న అనుచ‌ర‌గ‌ణంతో నిర్వ‌హించిన స‌మావేశంలో వ‌రుపుల సుబ్బారావు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

త‌న అనుచ‌ర‌గ‌ణం ముందు టీడీపీకి రాజీనామా అంశాన్ని ప్ర‌స్తావిస్తూ వ‌రుపుల సుబ్బారావు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. టీడీపీలో త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ విలపించ‌డంతో వైసీపీలో చేరాలంటూ ఆయ‌న‌పై అనుచ‌ర‌గ‌ణం ఒత్తిడి తెచ్చింది. దీంతో నేడో.. రేపో ఆయ‌న మ‌ళ్లీ వైసీపీ కండువాక‌ప్పుకునేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, బుధ‌వారం నాడు ప్ర‌త్తిపాడు మాజీ ఎమ్మెల్యే ప‌ర్వ‌త బాప‌న‌మ్మ కుటుంబ స‌భ్యులు వైసీపీ కండువాక‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.