కత్తి మహేష్ నన్ను వేధించాడు.. లైవ్ లో జూనియర్ ఆర్టిస్ట్ అవేధన!

Sunday, April 15th, 2018, 03:13:56 AM IST

కత్తి మహేష్ అంటే ఎలా పాపులర్ అయ్యాడో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై డైరెక్ట్ గా విమర్శలు చేస్తూ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేసి తనకు నిద్ర లేకుండా చేసుకున్న కత్తి మహేష్ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లో ఇరుక్కున్నాడు. శ్రీ రెడ్డి వివాదంతో మీడియా కత్తి మహేష్ ను డిబేట్ లకు పిలిచింది. అయితే సునీత అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ కత్తి మహేష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను అని అయితే కత్తి మహేష్ కు మీడియా సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో వాళ్లు కేసు నమోదు చేసుకోలేదని ఆ అమ్మాయి వివరించింది. అయితే బిగ్ బాస్ షో నుంచి తిరిగి వచ్చిన తరువాత కత్తి మహేష్ రూమ్ లోకి తీసుకు వెళ్లి లుంగీలో ఉంది డోర్ వేశాడని ఆమె చెప్పింది. అప్పట్లో పవన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు తాను మీడియా ఛానెల్ కి వచ్చినప్పటికీ నాన్ను మాట్లాడనివ్వలేదు అని ఆమె వివరించింది. ప్రతి అమ్మాయికి న్యాయం చేస్తున్నారు అన్నారు కదా. నాకు కూడా అతని నుంచి వేధింపులు వచ్చాయి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ.. తనకు కూడా న్యాయం చేయాల్సిందిగా ఆ మహిళా మీడియా ముందు వేడుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments