ఎన్టీఆర్ కథానాయకుడు: సినిమాపై అబ్బాయ్ నోరు మెదపడేంటి..?

Saturday, January 12th, 2019, 06:30:07 PM IST

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది , ఎన్టీఆర్ రోల్ బాలయ్యను చుసిన అభిమానులు, ప్రేక్షకులు అచ్చం ఎన్టీఆర్ నుచూసినట్టే ఉందంటూ ప్రశంసిస్తున్నారు. చిత్ర యూనిట్ ని సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అభినందిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. మోహన్‌బాబు, మహేశ్‌బాబు, అశ్వినిదత్‌, కోన వెంకట్‌, నాగ్‌ అశ్విన్‌, అనిల్‌ రావిపూడి, సుధీర్‌బాబు, మనోజ్‌ కుమార్‌, బీవీఎస్‌ రవి, గోపీ మోహన్‌, మంచు విష్ణు, కొరటాల శివ, గోపీచంద్‌ మలినేని తదితరులు సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్లు చేశారు. అయితే ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ ట్వీట్ రూపంలో గాని, ప్రెస్ మీట్ లో గాని తెలియజేస్తాడేమో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు, దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్టీఆర్ కథా నాయకుడు ప్రీ రిలీజ్ జూనియర్ ఎందుకో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవటం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. రిలీజ్ ముందు,.తర్వాత సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి మాట్లాడతేరేమో అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురు అయ్యింది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఈ మౌనాన్ని ఎలా అర్దం చేసుకోవాలో అర్దం కావటం లేదని అంటున్నారు. తన తాతగారి బయోపిక్ గురించి ఎన్టీఆర్ మాట్లాడకపోవటం అనేది కావాలనే చేస్తున్నాడా?, లేక ఏదైనా బిజీలో ఉన్నారా అనేది తెలియటం లేదు. అయితే కొంతమంది మాత్రం మళ్లీ నందమూరి ఫ్యామిలీ ,బాలయ్య జూనియర్ ను దూరం పెట్టారని అంటున్నారు. ఎన్టీఆర్ కు స్పెషల్ షో వేసి చూపిస్తారనుకుంటే అదీ జరగలేదు అంటున్నారు. మరో పక్క ప్రీ రిలీజ్ పంక్షన్ లోనే ఏదో జరిగిందని, ఎన్టీఆర్ హర్ట్ అయ్యారని మరి కొందరు అనుమానిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. మరి అనుమానాలపై ఎన్టీఆర్ నుండి కానీ, బాలకృష్ణ నుండి కానీ ఏదైనా క్లారిటీ వస్తే గాని, ఈ అనుమానాలు క్లియర్ అవ్వవన్నమాట.