అయోధ్య కేసును విచారించే జ‌స్టిస్ ఈయ‌నే!

Wednesday, October 3rd, 2018, 06:05:30 PM IST

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గా రంజన్ గోగాయ్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌ధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ సమక్షంలో రాష్ట్రపతి భవనులో ప్రమాణస్వీకారం చేశారు గోగాయ్‌. సుప్రింకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయ‌న పేరు చ‌రిత్ర లిఖిత‌మైంది. 63 ఏళ్ల రంజన్ గోగాయ్ అస్సాం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అస్సాం రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు తీసుకున్న తొలివ్యక్తి ఈయనే. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారాలు కూడా రంజన్ గోగాయ్ ఆధ్వర్య ంలో ప్రారంభం కానున్నాయి. జాతీయ స్థాయిలో ముఖ్యమైన కేసులు మరియు రాజ్యాంగ సంబంధిత కేసుల విచారణ సమయంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారంకు శ్రీకారం చుట్టనున్నారు.

జస్టిస్ రంజన్ గోగాయ్ 17 న‌వంబ‌ర్‌, 2019 వరకు దాదాపు 13నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. గోగాయ్ ఆధ్వర్యంలో అయోధ్య కేసు అక్టోబ‌ర్ 29న విచారణకు రానుంది. లోక్ పాల్ మరియు లోకాయుక్తా కేసులు రంజన్ గోగాయ్ విచారించారు. 2001లో గుజ‌రాత్ హైకోర్టు జ‌డ్జిగా,ఆ త‌ర్వాత పంజాబ్ , హ‌ర్యానా ఉమ్మ‌డి హైకోర్టుకు చీఫ్ జ‌స్టిస్‌గా భాద్యతలు నిర్వహించారు గొగోయ్. 2012 ఏప్రిల్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అజేయంగా కొనసాగుతున్నారు.
అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌ కేసుల సమస్యను పరిష్కరించడమే తనముందున్న లక్ష్యమ‌ని గోగాయ్ ప్ర‌క‌టించారు.