లోకేష్ ప్రచారకుడిగా ట్రంప్ ని గెలిపించిన వ్యక్తి.. ఆఫర్ అదిరిపోలా..!!

Tuesday, February 28th, 2017, 11:43:15 AM IST


ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారాలోకేష్ మంత్రి వర్గంలో చేరేందుకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి.ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి వర్గంలో చేరడం అడ్డా దారిలో వెళ్లడమే అని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. లోకేష్ కు దమ్ముంటే ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి ఆ తరువాతే మంత్రి పదవి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.కె ఏ పాల్ సువార్త సభల ద్వారా పాపులర్ అయ్యారు. లోకేష్ కి కె ఏ పాల్ ఓ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. లోకేష్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తే ఆయన తరుపున తాను ప్రచారం నిర్వహిస్తానని పాల్ ప్రకటించారు. తాను డోనాల్డ్ ట్రంప్ కి ప్రచారం నిర్వించిన ఆయన్ని గెలిపించానని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా లోకేష్ ప్రచార బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని పాల్ అన్నారు. లోకేష్ ఎమ్మెల్సీ గా వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలని పాల్ కోరారు.

తన సామర్థ్యాలను నమ్మి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు తీర్మానించిన పొలిట్ బ్యూరో కి లోకేష్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా ప్రతిపక్షాలు మాత్రం మంత్రి పదవి చేపట్టడానికి లోకేష్ కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నాయి.లోకేష్ ని మంత్రి వర్గం లోకి తీసుకోవాలని చంద్రబాబు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా సరైన సమయం కోసం ఎదురు చూశారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోకేష్ కి ఎమ్మెల్యే ల కోటాలో ఎమ్మెల్సీ దక్కేలా పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తద్వారా లోకేష్ కేబినెట్ లో ప్రవేశించేలా ప్లాన్ చేశారు.