మన తెలుగు హీరోలను భయపెడుతున్న ఆ హీరో ..!

Thursday, November 15th, 2018, 10:33:10 PM IST

టాలీవుడ్ కు దక్షిణాదిన ప్రత్యేక స్థానం ఉంది, బాహుబలి తర్వాత దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. గతంలో తమిళ సినిమాలు దక్షిణాది మొత్తాన్నీ డామినేట్ చేసేవి, ఇపుడు పరిస్థితి మారింది, తెలుగు చిత్రాలకు సైతం దక్షిణాదిలోనే కాకుండా హిందీలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తమిళ డబ్బింగ్ చిత్రాలకు తప్ప ఇక ఏ బాషా చిత్రాలకు తెలుగులో అంతగా ఆదరణ ఉండదు. పర బాషా హీరోలను కేర్ చేయని మన హీరోలు ఇప్పుడు ఒక కన్నడ యువ హీరోను చూసి భయపడుతున్నారు. ఆ హీరో ఎవరనగా యష్. ఇటీవల ఆతను నటించిన కేజీఎఫ్ ట్రైలర్ విడుదలై దేశవయాప్తంగా సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు హిందీలో 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి, కన్నడ ట్రైలర్ కు 8 మిలియన్ల వ్యూస్ రాగా, తెలుగులో 5మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కథ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు కన్నడతో సహా తెలుగు హిందీ,తమిళ,భాషల్లో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ప్లాన్ చేసుకున్న అంతరిక్షం, పడి పడి లేచే మనసు వంటి తెలుగు చిత్రాలకు కేజీఎఫ్ రూపంలో పెద్ద పోటీ వచ్చి పడింది. ఈ సినిమాకు కత్చితంగా భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా గనక ,మంచి టాక్ సొంతం చేసుకుందంటే ఆ వారం పాటు రిలీజ్ అయిన సినిమా కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది. దీంతో ఎలాగైనా ఈ అనువాద చిత్రాన్ని వాయిదా వెయ్యించాలని ప్రయత్నాలు కూడా మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.