ద‌ర్శ‌కేంద్రునికి ఓటు క్యూ ప‌రాభ‌వం

Friday, December 7th, 2018, 12:50:58 PM IST

తెలుగు సినిమాల్లో మౌన‌మునీంద్రుడిగా పేరుతెచ్చ‌కున్న రాఘ‌వేంద్రుడికి తెలంగాణ ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం ఎదురైంది. అదేంటి? తెలంగాణ ఎన్నిక‌ల‌కు సినీ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్రరావుకు లింకేటి? అత‌నికి ప‌రాభ‌వ‌మా.. అనుకుంటున్నారా?. ఈ రోజు జ‌రుగుతున్న ఎన్న‌క‌ల్లో త‌న ఓటును వినియోగించుకోవ‌డం కోసం ఫిలింన‌గ‌ర్‌లోని ఎఫ్ ఎన్ సీసీ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన పోలీంగ్ బూత్ కు ఆయ‌న వ‌చ్చారు. అయితే అప్ప‌టికే పెద్ద క్యూనే వుంది. దాంతో నేరుగా లోనికి వెళ్లి ఓటు వేయాల‌నుకున్నారు. అది గ్ర‌హించిన ఓ ఓట‌రు మీ కంటే ముందు క్యూలో వున్న మ‌మ్మ‌ల్ని దాటి వెళ్లి ఓటు ఎలా వేస్తారు? వ‌చ్చి లైన్‌లో నిల‌బ‌డండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడ‌ట‌.

దీంతో ఏం చేయాలో తోచ‌ని రాఘ‌వేంద్ర‌రావు లైన్‌లో నిల‌బ‌డ‌టానికి వ‌స్తున్న‌ట్లే వ‌చ్చి అక్క‌డున్న వారిని చూసి ప‌రాభ‌వంగా ఫీల‌య్యాడు. ఇక అక్క‌డ నిల‌బ‌డ‌లేక ఈగో హ‌ర్ట్ కావ‌డంతో ఓటు వేయ‌కుండానే అక్క‌డి నుంచి జారుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చిరంజీవికి ఇదే అనుభ‌వం ఎదురైంది. అయితే దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్న చిరంజీవి లైన్‌లో నిల‌బ‌డి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. ఈ రెండు సంఘ‌ట‌న‌ల్ని చూసిన సామాన్య ఓట‌రు మాత్రం త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌ను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సామాన్యుడిలా లైన్‌లో నిల‌బ‌డి ఓటు వేస్తాడు. అత‌న్ని చూసైనా మ‌న సినిమా వాళ్లు మార‌రా? అంటూ పెదవి విరిచేస్తున్నారు.