వీడియో : రజినీకాంత్ స్టైల్ లో ధోని..కాలా చెన్నై!

Friday, March 30th, 2018, 11:53:21 AM IST

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 11వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే క్రికెట్ అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలుపెట్టారు. క్రికెటర్స్ కూడా ప్రాంతీయా రాష్ట్రాల వారిని ఆకట్టుకోవడానికి వారి టేస్ట్ కి తగ్గట్టు కొన్ని యాడ్స్ తో ఆకర్షిస్తున్నారు. దాదాపు అన్ని టీమ్ లు ఐపీఎల్ కోసం రెడీ అయ్యాయి. అయితే ఈ ఏడాది అందరి ద్రుష్టి చెన్నైపైనే ఉందని చెప్పాలి. గత రెండు సీజన్స్ లో కనిపించని చెన్నై 2018లో ఫెవెరెట్ టీమ్ గా బరిలోకి దిగనుంది. అయితే ఆ జట్టు అభిమానులను ఆకట్టుకోవడానికి రజినీకాంత్ స్టైల్ లో అభిమానులను పలకరించారు. కాలా టీజర్ ను టీమ్ సభ్యులు హర్భజన్ – మురళి విజయ్ – బ్రేవో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనుకరించారు. ధోని రజినీకాంత్ డైలాగ్ ని డబ్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చెన్నై జట్టు మొదటి మ్యాచ్ ను ముంబై జట్టుతో ఏప్రిల్ 7న ఆడనుంది.