కాలా మొదటి రివ్యూ వచ్చేసింది!

Wednesday, June 6th, 2018, 11:09:19 AM IST

సౌత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాలా సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాగైనా సినిమా మంచి విజయం అందుకుంటుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. కబాలి తరువాత పా.రంజిత్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ కబాలి సినిమా అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. ఇకపోతే యూఏఈ నుంచి ప్రముఖ క్రిటిక్ సినిమా మొదటి రివ్యూ ఇచ్చేశాడు. ఉమైర్ సందు అనే సినీ విశ్లేషకుడు భారతీయ సినిమాలకు తరచు రివ్యూలు ఇస్తుండడం అలవాటే.

ఆయితే ఈ సారి కాలా సినిమాకు అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. సినిమాలు కళ్లు మూసుకొని 4 స్టార్స్ రేటింగ్ ఇవ్వవచ్చని చెప్పాడు. రజినీకాంత్ ను ఈ సినిమాలో సరికొత్త లుక్ లో చూస్తారు. పా.రంజిత్ దర్శకత్వం అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది. సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ దశలో సినిమా స్థాయి పెరుగుతుందని ఉమైర్ తెలిపాడు. అలాగే రజినీకాంత్ యాక్షన్ సీన్స్ విజిల్స్ వేయిస్తాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అన్నారు. ఈ సినిమా రేపు ఇండియాలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఉమైర్ గతంలో కబాలి సినిమాకు కూడా ఇదే తరహాలో రివ్యూ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. మరి ఈసారైన పా.రంజిత్ – రజినీకాంత్ కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో చూడాలి.