హిట్టా లేక ఫట్టా : ఫైనల్ గా కాలా ఎలా ఉందంటే?

Friday, June 8th, 2018, 09:15:21 AM IST

కబాలి సినిమా తరువాత రజినీకాంత్ – పా.రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కాలా. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు రజీని ఫ్యాన్స్ నుంచి ఫుల్ క్రేజ్ అందింది. సినిమా కథ కొంచెం పాతగా అనిపించినప్పటికీ కొన్ని సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. రజినీకాంత్ నటన సినిమాలో హైలెట్. నానా పటేకర్ తో పాటు మరికొంత మంది అద్భుతంగా నటించారు. అయితే సినిమా అనుకున్నంత రేంజ్ లో మాత్రం లేదు అనే టాక్ ఎక్కువగా వస్తోంది.

ఏషియన్ కంట్రీస్ లోనే అతిపెద్ద స్లమ్ ముంబైలోని ధారావి. అక్కడ ఎంతో మంది పేద ప్రజలు దీన స్థితిలో బ్రతుకుతుంటారు. ప్రభుత్వాలు పట్టించుకోవు. హరి దాదా (నానా పటేకర్) అనే ఒక రాజకీయ నాయకుడు ఆ స్లమ్ పై కన్నేస్తాడు. ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. అయితే పేద వారికి కాలా (రజినీకాంత్) అండగా ఉంటాడు. వారి కోసం పోరాడే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ఇక కాలా సినిమాకు వివిధ రకాల వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.

కాలా – ప్రజల కోసం పోరాడే నాయకుడి కథ

Reviewed By 123telugu.com |Rating :3/5

కబాలి కంటే బావుంది

Reviewed By greatandhra.com |Rating :2.75/5

కాలా.. మధ్యలో దారి తప్పాడు

Reviewed By tupaki.com |Rating : 2.5/5

పా.రంజిత్ విప్లవంలో రజినీకాంత్

Reviewed By timesofindia.com|Rating : 3.5/5

తమిళ్ ఫ్లేవర్ పొలిటికల్ మూవీ

Reviewed By telugucinema.com |Rating : 2.5/5

డల్ అండ్ బోరింగ్

Reviewed By mirchi9.com |Rating : 2.5/5


 


  •  
  •  
  •  
  •  

Comments