ఫెస్ బుక్ లైవ్ లో కాలా.. పట్టేసిన విశాల్!

Thursday, June 7th, 2018, 01:30:44 PM IST

ధనుష్ నిర్మాణంలో రజినీకాంత్ కథానాయకుడిగా వచ్చిన కాలా సినిమా నేడు ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే కొన్ని దేశాల్లో కాలా సినిమా ప్రీమియర్స్ ను ఒక రోజు ముందే ప్రదర్శించారు. అయితే ఎవరు ఊహించని విధంగా నిన్న ఫెస్ బుక్ లో కాలా లైవ్ లో దర్శనం ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. దాదాపు నలభై నిమిషాల పాటు లైవ్ లో సినిమా ను చూపించడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది.

ఇక విషయం చిత్ర యూనిట్ దగ్గరికి వెళ్లడంతో హీరో విశాల్ స్పందించాడు. పైరసీ నుంచి సినిమావాళ్లను రక్షించడంలో విశాల్ గత కొంత కాలంగా సహాయంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సింగపూర్ లో ఓ రజినీకాంత్ ఫ్యాన్ లైవ్ లో ప్రదర్శించాడని తెలుసుకున్న విశాల్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యాడు. అక్కడి పోలీసులతో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేసినట్లు విశాల్ తెలిపాడు. కాలా సినిమా తమిళ ఇండస్ట్రీకి చాలా పెద్ద సినిమా. రజిని సర్ రెండేళ్ల తరువాత వచ్చారు. బుధవారం జరిగిన ఘటన చాలా బాధాకరం. పైరసీ ని అరికట్టడంలో మేము ఎప్పటికి ముందు ఉంటాం. చిన్న విషయమే కదా అని కొందరు పాటలను సీన్స్ ను రికార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. క్రైమ్ తో సమానం. 40 నిమిషాల పాటు సినిమాను లైవ్ పెట్టినట్లు తెలియగానే అతన్ని వెంటనే నిందితుడిని పట్టుకున్నట్లు విశాల్ తెలియజేశారు.