కాలా.. 4ల‌క్ష‌ల మందే చూశారా?

Tuesday, May 29th, 2018, 02:07:19 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సీన్ అంత‌కంత‌కు కిందికి వెళుతోందా? ర‌జ‌నీపై అభిమానం ఉన్నా.. ఫెయిల్యూర్స్ బ్యాక్ బెంచీకి ప‌రిమితం చేస్తున్నాయా? అంటే అవున‌నే స‌న్నివేశం చెబుతోంది. తాజాగా రిలీజ్‌కి రెడీ అవుతున్న కాలా బిజినెస్ పూర్తి కాక‌పోవ‌డం.. ఆ స‌న్నివేశాన్ని రివీల్ చేసింది.

తాజాగా రిలీజైన తెలుగు ట్రైల‌ర్‌కి అస్స‌లు ఏమాత్రం క్రేజు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఉండే క్రేజు వేరుగా ఉంటుంది. కానీ ఆ క్రేజు అన్నిటా మిస్స‌వుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. `కాలా` లేటెస్ట్ ట్రైల‌ర్ నిన్న‌నే రిలీజైనా.. ఇప్ప‌టికి కేవ‌లం 4ల‌క్షల మంది మాత్ర‌మే వీక్షించారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లి కాలంలో చిన్నా చిత‌కా హీరోల ట్రైల‌ర్లు సైతం యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయ్‌. అలాంటిది ర‌జ‌నీ ట్రైల‌ర్ ఇంకా 10ల‌క్ష‌ల వ్యూస్ అయినా ద‌క్కించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు కాలా వాయిదా ప‌డ‌డం కూడా ఇందుకు కార‌ణం కావొచ్చు. ట్రైల‌ర్ ఆద‌ర‌ణ ఎలా ఉన్నా.. ఈ సినిమా తెలుగులో ఎంత‌వ‌ర‌కూ నెగ్గుకొస్తుందో అన్న క్యూరియాసిటీ ట్రేడ్‌లో ఉంది. జ‌స్ట్ వెయిట్..

  •  
  •  
  •  
  •  

Comments