కాలా సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్!

Thursday, June 7th, 2018, 01:04:42 PM IST

ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ రాజినీకాంత్ అని అందరికి తెలిసిందే. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఓ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. ఇక ప్రమోషన్స్ బజ్ క్రియేట్ అయితే సూపర్ స్టార్ కి అదిరిపోయే ఓపెనింగ్స్ అందుతాయి. కానీ కాలా విషయంలో ఈ సారి ఎవరు ఊహించని విధంగా జరిగింది. యూఎస్ లో గురువారం అన్ని భాషల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించగా కేవలం $600k మాత్రమే వచ్చాయి.

మొదటి రోజు ప్రీమియర్స్ అంటే వన్ మిలియన్ క్రాస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దాని ధాపుల్లో కూడా కాలా నిలవలేదు. గతంలో వచ్చిన కబాలి సినిమా 1.92 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఆ లెక్కన చుస్తే సగం కూడా కాలా ప్రీమియర్ షో కలెక్షన్స్ ను అందుకోలేదు. ఎందుకంటే దర్శకుడు పా.రంజిత్ కబాలికి హైప్ క్రియేట్ చేసిన విధానం భారీ స్థాయికి చేరుకున్నప్పటికీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కాలా కాంబినేషన్ పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు. అలాగే సినిమా ట్రైలర్ సాంగ్స్ పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోవడంతో ఓపెనింగ్స్ అందలేదని తెలుస్తోంది.