క‌డ‌ప స్టీల్ ప్లాంట్ .. మ‌ళ్లీ తెర‌పైకి

Thursday, September 29th, 2016, 01:51:18 AM IST

KVP
క‌డ‌ప‌కు స్టీల్‌ప్లాంట్ రాకుండా మోకాల‌డ్డేస్తోంది ఎవ‌రు? తేదేపా- భాజ‌పా దొందూ దొందే. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, అటు కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుకుంటున్నాయ‌ని మండిప‌డ్డారు వైకాపా నేత కె.వి.పి. రామ‌చంద్ర‌రావు. ఆయ‌న మీడియా స‌మ‌క్షంలో అటు కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. ఇటు చంద్ర‌బాబుపైనా రుస‌రుస‌లాడారు.

ప్ర‌త్యేక హోదాపై కెవిపి బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు బోలెడంత హ‌డావుడి సాగింది. తాజాగా మ‌రోసారి క‌డ‌ప స్టీల్ ప్లాంట్ అంటూ కెవిపి హ‌డావుడి చేస్తున్నారు. మొత్తానికి బాబు కంట్లో న‌ల‌క‌లా, కేంద్రం గుండెల్లో గుల‌క‌రాయిలా త‌యార‌య్యారు కేవీపీ.

  •  
  •  
  •  
  •  

Comments