మండ‌లి ఛైర్మ‌న్‌గా క‌డియం శ్రీ‌హ‌రి?

Saturday, February 9th, 2019, 10:42:31 AM IST

ఈ నెల 10న తెలంగాణ మంత్ర విర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇన్న‌టికే ప‌లువురికి మంత్రి ప‌ద‌వుల‌ని ఖ‌రారు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క‌మైన మండ‌లి ఛైర్మ‌న్‌గా మాజీ విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రిని నియ‌మించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మార్చిలో ఖాళీ కాబోతున్న 16 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన కేసీఆర్ మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌విపై కూడా దృష్టి పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

మార్చి 28తో ప్ర‌స్తుత మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ ప‌ద‌వీకాలం ముగియ‌బోతోంది. తిర‌గి ఆయ‌న మ‌ళ్లీ మండ‌లి ఛైర్మ‌న్‌గా కొన‌సాగే అవ‌కాశం లేద‌ని, ఆయ‌న‌ను చేవెళ్ల నుంచి ఎంపీగా బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో మండ‌లి కొత్త చైర్మ‌న్ ఎంపిక ర‌ప‌వ‌త్త‌రంగా మారింది. దీంతో ఆ స్థానంలో మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రిని చైర్మ‌న్‌ను చేయాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ వున్న‌ట్లు తెరాస‌ వ‌ర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా రెడ్యానాయ‌క్ లేదా రేఖా నాయ‌క్‌ని నియ‌మించే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.