మీ లాగులు పంచెలు తడవడం ఖాయం.. కాంగ్రెస్ కు కడియం కౌంటర్!

Saturday, September 1st, 2018, 02:23:29 PM IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్ష మరియు ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే వార్నింగ్ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. టీఆరెస్ నేతలు కూడా మీతిమీరిన ప్రతిసారి కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం అందరిదృష్టి టీఆరెస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభపైనే పడింది. ఈ సభపై ముందుగానే కాంగ్రెస్ నేతలు కామెంట్ చేయడం మొదలుపెట్టగా టీఆరెస్ నేతలు కూడా ప్రతిస్పందిస్తున్నారు.

రీసెంట్ గా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రస్ నేతలపై మాటలతో విరుచుకుపడ్డారు. 25 లక్షల మందికిపైగా పాల్గొనే ఈ సభ చరిత్రలో నిలుస్తుందని సభను చూసిన తరువాత కాంగ్రెస్ నేతల లాగులు పంచెలు తడవడం ఖాయమని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము కూడా భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని టీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు కౌంటర్ గా శ్రీహరి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నారని సొంత జిల్లాలో ఇద్దరి నాయకులను సమన్వయంలోకి తేలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారని తెలిపారు. అదే విధంగా కొన్ని జిల్లాల్లో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారని ముందస్తు ఎన్నికలంటే ఆ పార్టీ భయపడుతోందని ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments