చెన్నై గెలుస్తుందని తెలుసు.. జోస్యం నిజమైంది : కైఫ్

Monday, May 28th, 2018, 09:44:44 AM IST

2018 ఐపీఎల్ ట్రోపిని మొత్తానికి ధోని సేన ఎగరేసుకుపోయింది. హైదరాబాద్ జట్టును ఫైనల్ తో కలిపి వరుసగా నాలుగు సార్లు దెబ్బ కొట్టిన చెన్నై అద్భుత విజయాన్ని అందుకుంది. ఫైనల్ లో 7 వికెట్లతో విజయాన్ని అందుకోవడం ఎవరు ఊహించలేకపోయారు. కానీ రెండు జట్లలో ఏది గెలుస్తుందా అనే విషయాన్ని ఒక సీనియర్ క్రికెటర్ ముందే చెప్పారు. అందుకు అతను చెప్పిన ఒక ఉదాహరణ మొత్తానికి నిజమైంది.

ఆ సీనియర్ క్రికెటర్ మరెవరో కాదు. ఇండియన్ టీమ్ లో బెస్ట్ ఫీల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ కైఫ్. ఫైనల్ లో ప్రత్యర్థి ఎవరైనా చెన్నై ఛాంపియన్ గా నిలుస్తుందని అన్నాడు. ఎందుకంటే ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరగా ఉంటే అప్పుడు టాప్ లో రెండవ స్థానంలో ఉండి ఫైనల్ కి వెళ్లిన జట్టు కప్పు అందుకుంటుందని జోస్యం చెప్పాడు. గత లెక్కలను చూసుకుంటే.. 2011 – చెన్నై, 2013 – ముంబై, 2014 – కోల్ కతా జట్లు టైటిల్ గెలవగా ఆ ఏడాదిలో ఢిల్లీ డేర్ డెవిల్స్ చివరలో ఉంది. ఈ లెక్క ఈ ఏడాది కూడా మిస్ అవ్వకపోవడంతో చెన్నై గెలిచిందని కైఫ్ తెలిపాడు.