ఆ హీరోయిన్ కి కోహ్లీ హాట్ గా కనిపిస్తాడట.. అనుష్క ఏమైపోవాలి..!!

Saturday, October 14th, 2017, 03:45:34 PM IST

బాలీవుడ్ ముద్దు గుమ్మ కైరా అద్వానీ క్రమం గా టాప్ పొజిషన్ కు చేరుకుంటోంది. బాలీవుడ్ లోనే కాదు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి కూడా కైరా కు ఆఫర్ లు వస్తున్నాయి. కైరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో భాగంగా కైరా అద్వానీ క్రికెట్ స్టార్స్ ధోని, కోహ్లీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.

గత ఏడాది ధోని బయోపిక్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం లో కైరా ధోని భార్య సాక్షి పాత్రలో మెరిసింది. మీ అభిమాన క్రీడాకారుడు ఎవరు ? డిన్నర్ డేట్ కి ఎవరితో వెళతారు అనే ప్రశ్నలకు తడుముకోకుండా ధోని అని సమాధానం చెప్పేసింది. ధోని తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. హర్భజన్ సింగ్ మ్యారేజ్ రిసెప్షన్ లో ఈ విషయాన్ని దగ్గర నుంచి చూసాను. ధోని తో డిన్నర్ డేట్ కు వెళ్లాలని ఉంది ని చెప్పేసింది. ఇక టీం ఇండియా ఆటగాళ్లలో కోహ్లీ చాలా హాట్ గా ఉంటాడు అని చెప్పేసి నవ్వేసింది.

కైరా కోహ్లీపై కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కోహ్లీ ప్రేయసి అనుష్క ఆల్రెడీ ఉందని, కైరా కన్ను పడింది కాబట్టి ఆమె పరిస్థితి ఏంటని సరదా పోస్ట్ లు పెడుతున్నారు.