వివాదంలో కాజల్ అగర్వాల్..?

Wednesday, September 10th, 2014, 02:57:44 AM IST


సినీనటి కాజల్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్ దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై కేసు నమోదు చేశారు. ఉదయనిది స్టాలిన్ నన్పెండా చిత్రంలో నటించేందుకు కాజల్ అగర్వాల్ కు 40 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చారు.అయితే, కొన్ని కారణాల వలన కాజల్ అగర్వాల్ స్థానంలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు.

కాజల్ అగర్వాల్ కు అడ్వాన్స్ గా ఇచ్చిన నలభై లక్షలు తిరిగి ఇవ్వాలని, కాజల్ ను ఉదయనిది స్టాలిన్ కోరారు. కాని అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా, తదుపరి చిత్రంలో నటించేందుకు ఒకే చెప్పానని కాజల్ చెప్పినట్టు తమిళ మీడియాలో కధనాలు వెలువడ్డాయి. ఈ విషయం చర్చల ద్వారా పరిష్కారం కాకపోవడంలో ఉదయనిది నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.