కేవ‌లం ప‌బ్లిసిటీ కోసమేనా.. సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ చందమామ కూడా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్..!

Friday, October 12th, 2018, 12:43:28 PM IST

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగర్వాల్ తాజాగా సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి ఏర్ప‌డిన మీ..టూ కి మ‌ద్ద‌తు తెల్పింది. కొత్త‌గా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే అమ్మాయిల‌ను లైంగికంగా వేధించి.. వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని వాడుకొని.. తీరా ప‌ని అయిపోయాక వ‌దిలేసే వాళ్లు చాలా మంది ఉన్నార‌ని.. మ‌హిళ‌లంద‌రు ఇక‌నైన ఎదుర్కొన‌క పోతే మ‌హిళ‌ల ఉనికికే ప్ర‌మాదం వ‌స్తుంద‌ని కాజ‌ల్ అన్నారు. ఇటీవ‌ల సినీ కాస్టింగ్ కౌచ్ పై జ‌రుగ‌తున్న ర‌గ‌డ పై కాజ‌ల్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించ‌డంతో తెలుగు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది..

ఇక తాము ఎదుర్కొన్న వేధింపులు మీడియా ముందు బ‌య‌ట పెట్టే మ‌హిళ‌లంద‌రికీ తాను మ‌ద్ద‌తు తెల్పి ప్రోత్సాహం క‌ల్పిస్తాన‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల పై ప్ర‌తిఘంటించిన మ‌హిళ‌లకు ఎలాంటి ఘ‌ట‌న‌లు జరిగాయో కూడా తాను ఊహించ‌లేన‌ని కాజ‌ల్ అన్నారు. ఇక కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే కొంత‌మంది ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు ఇటీవ‌ల్ మీడియా ముందుకు వ‌చ్చి కాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డెక్కుతున్నార‌ని అనుకునే చాలా మందికి తాను ఒక‌టే చెప్పాల‌ని అనుకుంటున్నాన‌ని.. మ‌హిళ‌ల్ని త‌క్కువ చేసి చూడొద్ద‌ని.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం వేరే వారిపై ఎవ‌రైనా బుర‌ద జ‌ల్లుతారా అంటూ కాజ‌ల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రి రోజు రోజుకీ ఉదృతం అవుతున్న మీ..టూ ఉధ్య‌మం ఎంత దూరం వెళుతుందో చూడాలి.