కర్ణాటకలో సూపర్ స్టార్ కాలా కు అడ్డంకులు ?

Sunday, June 3rd, 2018, 12:48:12 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న కాలా చిత్రం ఈ నెల 7న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను కర్ణాటకలో విడుదల కానివ్వమంటూ కన్నడ ప్రజలు ఫైర్ అవుతున్నారు. దాంతో పాటు కర్ణాటక ఛాంబర్ కూడా కాలా చిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదల కనివ్వమంటూ ప్రకటించింది. తాజాగా సూపర్ స్టార్ కావేరి జలాల వివాదం విషయంలో అటు కర్ణాటక, ఇటు తమిళనాడు మధ్య పెద్ద వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తమిళనాడుకు సూపర్ స్టార్ మద్దత్తు తెలిపిన నేపథ్యంలో కన్నడ ప్రజలు ఆందోళన రేపారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫాన్స్ ను కూడా కొడతామంటూ నానా రభస చేస్తున్నారు. మరి కాలా సినిమా కర్ణాటకలో విడుదల అయ్యే అవకాశాలు లేవు. ఇతర తమిళ హీరోల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పారు. చూద్దాం .. ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments