కాళేశ్వరంతో ఆంధ్రాకు న‌ష్ట‌మెంత‌?

Thursday, May 3rd, 2018, 10:00:14 PM IST

మునుముందు ఏపీ-తెలంగాణ మ‌ధ్య నీటియుద్ధాల‌కు ఆస్కారం ఉందా? అంటే లేక‌పోలేద‌నే వారే ఎక్కువ‌. త‌మిళ‌నాడు- క‌ర్నాట‌క మ‌ధ్య కావేరీ జ‌లాల స‌మ‌స్య త‌ర‌హాలోనే మున్నుందు పెను స‌మ‌స్య‌ల్ని ఈ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్లోబ‌ల్ వార్మింగ్ నేప‌థ్యంలో న‌దీజ‌లాలు అడుగంటిపోయే స‌న్నివేశం ముందుంది. ఈ నేప‌థ్యంలో నీటి క‌ట‌క‌ట రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు తావిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇలాంటి వేళ తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నీటి ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేస్తోంది. ముఖ్యంగా గోదావ‌రిపై కాళేశ్వ‌రం అత్యంత వేగంగా పూర్త‌వుతోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప‌రిశీల‌న అంతే సీరియ‌స్‌గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీష్‌రావు నేడు ఆకస్మిక తనిఖీలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు ప్యాకేజీల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, మరింత వేగంగా చేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. ప‌నిలో ప‌నిగా జూలైనాటికీ విద్యుత్ సబ్‌స్టేషన్లు పూర్తి చేయాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకూ పలు ప్యాకేజీలు సందర్శిస్తూ.. అక్కడిక్కడే పనుల పురోగతిపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
కాలేశ్వ‌రం స‌హా అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్లను మే నెలాఖరు కల్లా చార్జీంగ్ కావాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ 8 నుంచి వరద కాలువ దాకా సాగే గ్రావిటీ కాలువ పనులను హరీష్‌రావు పరిశీలించారు.ప‌లుర‌కాల ప‌నులు జూన్ 15కల్లా ఈ పనులు పూర్తి కానున్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం నీటి ప్రాజెక్టులు, జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుల్ని ఎంత సీరియ‌స్‌గా తీసుకుందో అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది. ఇక‌పోతే మునుముందు ఈ ప్రాజెక్టుల వ‌ల్ల కచ్ఛితంగా ఆంధ్రాకు స‌మ‌స్య త‌ప్ప‌ద‌ని చెప్పొచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments