కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్!

Thursday, June 14th, 2018, 01:32:30 AM IST

నిర్మాతగా హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ నా నువ్వే చిత్రం గురువారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో తాను ఒక సినిమాను నిర్మిస్తున్నట్లు కళ్యాణ్ రామ్ చెప్పారు. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో చరణ్ తో మల్టి స్టారర్ చేస్తాడు. ఇక ఈ లోపు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో తనే హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేసి ఆ తరువాత తారక్ తో ఒక సినిమా చేయనున్నట్లు చెప్పారు. అయితే రాజమౌళి మల్టీస్టారర్ రిలీజ్ కావడానికి చాలా సమయం పడుతుంది. అంటే కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో సినిమా 2020 లోనే ఉంటుందని టాక్ వస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments