కమల్ – రజినీకాంత్.. పాలిటిక్స్ వార్ మొదలైంది!

Tuesday, March 13th, 2018, 11:27:08 AM IST

తమిళనాడులో హీరోల మధ్య రాజకీయ వేడి కొంచెం కొంచెంగా వైరల్ అవుతోంది. రజినీ కాంత్ వర్సెస్ కమల్ హాసన్ పాలిటిక్స్ ఇప్పుడు ట్రేండింగ్ గా నడుస్తోంది. రిసేంటి గా మక్కల్ నీది మయ్యమ్ పేరుతో కమల్ హాసన్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ మాత్రం ఇంకా బ్యాక్ గ్రౌండ్ వర్క్ లోనే ఉన్నాడు. ఎవరికీ అర్ధం కానీ బాటలో రాజకీయాన్ని నడిపిస్తున్నాడు అన్నది ఇప్పుడు విశ్లేషకుల కామెంట్. అభిమానులతో కూడా రజినీ కాంత్ నెలకోసారి సమావేశాలను జరుపుతూనే ఉన్నాడు.

ఇకపోతే రీసెంట్ కమల్ హాసన్ రాజకియ పరంగా రజినీకాంత్ కు ఒక సవాల్ ని విసిరాడు. రజినీకాంత్ చాలా వరకు కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన ఎందుకు ఉంటున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా కావేరి నది జలాల గురించి రజినీ స్పందించడం లేదు. కనీసం నిరసనల్లో కూడా పాల్గొనలేదని కమల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతే కాకుండా కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన రజినీ తమిళులకు సపోర్ట్ గా ఎందుకు తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు అని ప్రశ్నించారు. ఫైనల్ గా ఈ విషయంపై రజినీ స్పందించాలని కోరారు.