మోదీపై క‌మ‌ల్ ఫైరింగ్ లెట‌ర్‌

Friday, April 13th, 2018, 01:20:51 AM IST

కావేరీ జ‌ల‌వివాదంతో త‌మిళ‌నాడు అట్టుడుకుతోంది. ప్ర‌జ‌లంతా రోడ్ల‌పైకి వ‌చ్చి నిన‌దిస్తున్నారు. రైతులు కంటిపై కునుకు లేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఓవైపు న‌దీజ‌లాల పంపిణీపై సుప్రీంలో స్ప‌ష్ట‌మైన తీర్పు ఉన్నా క‌ర్నాట‌క ఎన్నిక‌ల వేళ త‌మ‌కు ఫ‌లితం ప్ర‌తికూలంగా మార‌కుండా భాజ‌పా-ఎన్డీయే అధిష్ఠానం ఈ వ్య‌వ‌హారంపై కిమ్మ‌న‌కుండా ఉంది. దీనిని త‌మిళ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. వీళ్ల‌కు క‌మ‌ల్ హాస‌న్ స‌హా త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ యావ‌త్తూ మ‌ద్ధ‌తు ప‌లికింది.

నేడు ప్ర‌ధాని మోదీపై సీరియ‌స్ అవుతూ క‌మ‌ల్ ఓ బ‌హిరంగ లేఖ‌ను రాశారు. గౌర‌వ‌నీయులైన మోదీగారికి విన్న‌పం.. అని మొద‌లుపెట్టిన క‌మ‌ల్ ప్ర‌ధానిపై ఓ రేంజులో విరుచుకుప‌డ్డారు. సుప్రీం తీర్పు వ‌చ్చినా, మీ తాత్సారం వెన‌క అర్థం ఏమిటి? నిజాయితీని నిరూపించుకోండి అంటూ స‌వాల్ విసిరారు క‌మ‌ల్‌. న‌ర్మ‌దా జ‌లాల వివాదంలో గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు చూసిందే ఇప్పుడు చూస్తున్నారు. మీ అనుభ‌వం దృష్ట్యా ఈ స‌మ‌స్య‌ను ఒక దేశ ప్ర‌ధానిగా ప‌రిష్క‌రించండి అని క‌మ‌ల్ సూచించారు. సుప్రీం తీర్పు వెలువ‌రించినా ఇంకా తాత్సారం చేస్తుంటే జ‌నం మిమ్మ‌ల్ని సందేహిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments