కమల్ హాసన్ సెటైర్ మామూలుగా పేలలేదుగా..!

Monday, February 13th, 2017, 02:25:33 PM IST


రాజకీయ సామజిక అంశాలపై కమల్ హాసన్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఆయన తన అభిప్రాయాలను వెల్లడించడానికి సంకోచించరు. ప్రస్తుతం తమిళనాడు లో ప్రజాప్రతినిధులు ఉన్న పాలన నడవడం లేదు. దానికి కారణం పన్నీర్ సెల్వం, శశికళ ల మద్యం సీఎం కుర్చీ కోసం జరుగుతున్న పోరాటమే. తమిళనాడులో ప్రస్తుంతం రాజకీయ రాజకీయ సంక్షోభం నెలకొంది.

దీనిపై లోకనాయకుడు తనదైన శైలిలో స్పందించారు.” అధికారం రెండు రకాలు..ఒకటి శిక్ష పడుతుందన్న భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమపూర్వకంగా అధికారం చేపట్టడం – మహాత్మా గాంధీ (నేను అనుసరించే హీరో)” అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి ఇలాగే ఉందని నెటిజన్లు కమల్ కు మద్దత్తు తెలుపుతున్నారు. కమల్ వేసిన సైటైర్ శశికళ పైనే అనికూడా అంటున్నారు.శశికళ.. జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ 2 ముద్దాయిగా ఉన్నారు.ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కోర్టులో ఉంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే శశికళ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని అర్థం వచ్చేలా కమల్ ట్వీట్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.