కమల్ హసన్ తో పవన్ కళ్యాణ్ కలిస్తే? తమిళ రాజకీయం!

Sunday, September 24th, 2017, 03:50:42 AM IST

తమిళ రాజకీయాలను అర్ధం చేసుకోవాలంటే ఎంతటి రాజకీయ విశ్లేషకులకైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని పై ఎత్తులు అక్కడ కనిపిస్తాయి. అక్కడ సినిమాలాకె హావా అనుకుంటే అంతకుమించి రాజకీయా నాయకులు హవాను కొనసాగిస్తారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఒక్క నాయకుడు తీసుకొనే ఒక్క నిర్ణయం అక్కడి రాజకీయాల్లో ఊహించని పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పుడైతే పరిస్థితి దారుణంగా మారిపోయింది. సినిమా ప్రస్తుత తారలు ఈ మధ్య ఎక్కువగా రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ – కమల్ హాసన్ వంటి అగ్రనటులు అక్కడ రాజకీయ చక్రం తిప్పడానికి రెడీగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దేశ రాజకీయ పార్టీలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నాయి.

అయితే గత కొంత కాలంగా అక్కడ అధిష్టాన పార్టీలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభుత్వం కూలిపోవచ్చనే కామెంట్స్ వినబడుతున్నాయి. దీంతో అదే అనువుగా చేసుకోవాలని ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఆ ఆలోచనలో ఉన్నా ప్లాన్స్ మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. అయితే ఎవరు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కమల్ ఇంతకుముందు పన్నీర్ సెల్వం వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని వార్తలు బాగానే వచ్చాయి. కానీ పన్నీర్ ముఖ్యమంత్రి పళాని వర్గంతో చేతులు కలిపి అందరికి మరో షాక్ ఇచ్చారు. అయితే కమల్ ఈ సారి అన్నాడీఎంకే వర్గాల వైపు వెళ్లకుండా కమలనాథులను కలుస్తారా అంటే అది లేదు. ప్రస్తుతం తమిళ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ గా మారింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ నడిచిన దారిలోనే ఆయన నడవడానికి సిద్ధమయ్యారు అనే టాక్ వినిపిస్తోంది. అంటే కమల్ కూడా ఈ సారి ఒక పార్టీకి ఫుల్ సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారా? అంటే అది కాదు. జనసేన ఏ విధంగా అభ్యర్థులను పరీక్షలు పెట్టి ఎంపిక చేసుకుంటుందో.. అదే తరహాలో కమల్ కూడా అడుగులు వేస్తున్నారని టాక్. రిజల్ట్ ఎలా ఉన్నా ఒంటరిగానే పోటీకి దిగడానికి నిర్ణయించుకున్నారట. ఎక్కువగా యువకులను తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చుడాలి మరి కమల్ ఏ విధమైన ఆలోచనతో సక్సెస్ అవుతాడో..

  •  
  •  
  •  
  •  

Comments