కమల్ హాసన్ పొలిటీషియన్ లుక్ అదిరింది

Friday, October 13th, 2017, 02:10:01 AM IST

నటనలో లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరును కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంలో కమల్ కొన్ని వ్యూహాలను రచించినట్లు తమిళ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక పూర్తిగా రాజకీయ నాయకుడిగా కూడా కనిపించాలి కాబట్టి కమల్ తన స్టైల్ ని కూడా మార్చేశాడు. ఎవరు ఊహించని విధమైన సరికొత్త పంచె కట్టులో పొలిటీషియన్ లాగ దర్శనం ఇచ్చాడు. రియల్ పొలిటీషియన్ లాగ హావభావాలను చూపిస్తూ స్టిల్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక పార్టీ ప్రారంభం అయితే ఇవే లుక్స్ లో ఫ్లెక్సీలు రెడీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ స్టిల్స్ తో కమల్ జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.