ర‌జ‌నీని, న‌న్ను చూసి ఓటేయ‌రు!

Sunday, October 7th, 2018, 01:00:44 AM IST

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ మక్కల్‌ నీది మయ్యo పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పాల‌సీని ఆయ‌న ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. తాజాగా ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన క‌మ‌ల్ పార్టీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో నా పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నా. నా పార్టీ కి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటి సాధన కోసం కృషి చేస్తున్నాను. సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తులున్నారని తెలిపారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ని కాద‌ని మిమ్మ‌ల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అన్న ప్ర‌శ్న‌కు ప్రజలు సరైన అభ్యర్థిని ఎంచుకుంటారు.. ప్రముఖ వ్యక్తిని కాదు అని స‌మాధాన‌మిచ్చారు.

మీరు రాజ‌కీయ నాయ‌కుల నుంచి ఏవైనా ఇబ్బoదులు ఎదుర్కొన్నారా? అన్న ప్ర‌శ్న‌కు.. నాకు చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. నా ఆస్తుల్ని చాలావ‌ర‌కూ సీజ్‌ చేసేశారు. ఇది నాకు గుణ పాఠం నేర్పింది.. అని తెలిపారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అన్న ప్ర‌శ్న‌కు.. రాజకీయాలు మంచివి కావని నా స్నేహితులు చెప్పినా.. వాళ్లంతా రాజకీయ నాయకులే కావ‌డంతో విన‌లేదు. 20 ఏళ్ల ముందు నా సినిమాలు ఇంకా రాజకీయంగా మారాయి. అది నా నటనలో అందరికీ కనిపించింది. తమిళ ప్రజల కోసం మాట్లాడటానికి రాజకీయాల్లోకి వచ్చాను.. అని తెలిపారు. ఉద్యోగాలకు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు.. రాష్ట్ర అభివృద్ధికి అవి కావాలి. ప్ర‌జారోగ్యం గురించి ఆలోచించాలి.. అని తెలిపారు. రాహుల్ గాంధీ అవస‌రం దేశానికి ఉంద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా వ్యాఖ్యానించారు. అభిప్రాయాలు ఒక్కటి కానప్పుడు వారు ఎప్పుడూ కలిసి పనిచేయలేరని భాజ‌పానుద్ధేశించి అన్నారు.