జగన్ కు ఆ అర్హత లేదా..కామినేని అంత మాట అన్నారేంటి..!

Wednesday, January 24th, 2018, 03:41:47 PM IST


ఏపీలో అప్పుడే పొత్తు రాజకీయాలు మొదలైపోయాయి. అటు టీడీపీకి, ఇటు వైసీపీకి నరేంద్ర మోడీ హాట్ కేకులా మారారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా స్ఫష్టంగా కనిపిస్తున్న తరుణంలో 2019 ఎన్నికల్లో విజయం కోసం ఆయన చరిష్మా ని వాడుకోవడానికి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు పొతే పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి మోడీని వదులుకునే ఆదేశం అయితే లేదు. ఇక జగన్ కూడా బిజెపితో పోటుకు తీవ్రమా ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోని ఓ వర్గం అయితే జగన్ తో పొత్తుకు రెడీ గ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీలో ఉన్న చంద్రబాబు అనుకూల వర్గం అయితే జగన్ తో పొత్తుకు ససేమిరా అంటోంది.

దీనితో పొత్తు రాజకీయాలు ఎలాంటి మలుపుతిరుగుతాయో అని ఆసక్తి నెలకొని ఉంది. ఎపి మంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తో పొత్తు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. జగన్ తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఏంటి.. జగన్ నరేంద్రమోడీ పక్కన నిలుచోవడం కూడా నేను ఊహించలేను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతులో అవినీతి కేసులో ఇరుక్కుపోయిన జగన్ ని, ప్రధాని పక్కన చూడలేనని అన్నారు. మాణిక్యాల రావు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పార్టీలు చేస్తున్న ఏ హడావిడి అంతా వ్యూహంలో భాగమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలు ఎంత హడావిడి చేసిన పొత్తులు వ్యవహారం తేలేది ఎన్నికల ముందు మాత్రమే. ఆల్రెడీ టీడీపీ – బిజెపి మధ్య ఎలాగోలా మిత్రబంధం కొనసాగుతోంది. ఈ సమయంలో జగన్ బిజెపితో పొత్తుకు సిగ్నల్స్ ఇస్తుండడం తన శక్తి పై తాను సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అని రాజకీయ వర్గాలు అభిప్రాయం పడుతున్నాయి.