జ‌న‌సేనానిపై క‌మ్మ ప‌త్రిక దారుణ విషం?

Sunday, September 23rd, 2018, 11:30:11 PM IST

మెగాఫ్యామిలీపైనా, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పైనా తొలి నుంచి విషం చిమ్ముతున్న క‌మ్మ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి మ‌రోసారి కాల‌కూట విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలోని రొట్టెల కార్య‌క్ర‌మానికి విచ్చేస్తున్న వేళ అత‌డిపై ఓ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక- డాట్‌కాం శ‌నివారం నాడు ప్రచురించాయి. ఈ క‌థ‌నం ఆద్యంతం ప‌వ‌న్‌పై విషం క‌క్కే ప్ర‌య‌త్నం చేసింది. ఇది కులానికి సంబంధించిన ప్ర‌మాద‌క‌ర విష‌యం అని ఆ ఆర్టిక‌ల్ చ‌దివేవారికి సులువుగా అర్థ‌మైపోతోంది. ఎంత పైకి సోప్ వేసి రుద్దినా ఆ ఆర్టిక‌ల్ లో క‌మ్మ విషాన్ని మాత్రం దాచ‌లేక‌పోవ‌డం కాపు వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఇక ఏపీ- తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి ర‌గులుతున్న‌ వేళ స‌ద‌రు క‌మ్మ ప‌త్రిక ప్ర‌త్యేకించి కాపు వ‌ర్గం నాయ‌కుల్ని, ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అభిమానుల్లో, ఏపీ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాపుల్లో ఈ ప‌త్రిక‌పైనా, టీవీ చానెల్‌పైనా, కుల‌పిచ్చిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగా ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. చిరంజీవి అన్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా ఆ జిల్లాలో కాపుల‌తో పాటు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంది అంటూనే, అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక మెగా ఫ్యామిలీని అక్క‌డ ప్ర‌జ‌లు ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని స‌ద‌రు క‌థ‌నం సోప్ వేసి రుద్దింది. అయితే ఈ క‌థ‌నం చ‌దివిన వాళ్ల‌కు ఓ విష‌యం అర్థ‌మైంది. గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రు నువ్వా నేనా? అంటే నేనే అన్న చందంగా స‌ద‌రు ప‌త్రిక‌లో క‌మ్మ కులంలో మొద‌లైన భ‌యం గుట్టును రివీల్‌ చేసింది. ఓ ర‌కంగా ఈ కుల జాఢ్యాన్ని మీడియాకి అంటించిన‌ స‌ద‌రు ప‌త్రిక, స‌ద‌రు క‌మ్మ చానెల్ గురించి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంతే సీరియ‌స్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి క‌మ్మ పార్టీ అయిన తేదేపాని త‌రిమితరిమి కొట్ట‌డం ద్వారా స‌ద‌రు అగ్ర‌కుల ఝాడ్యాన్నితుంగ‌లో తొక్కే ప్లాన్‌లో ఉన్నారు. బాబు ధ‌న రాజ‌కీయం ఈసారి ఎన్నిక‌ల్లో చెల్ల‌ద‌న్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్ – చిరు ఫ్యామిలీకి నెల్లూరు లో భారీ ఫాలోయింగ్ ఉంది. అలానే కాపు బ‌ల‌గాలు ఇక్క‌డ పుష్క‌లంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌కు పార్టీ నెల్లూరు క‌న్వీన‌ర్ మాదాసు గంగాధ‌రం రూపంలో పెద్ద అండ ద‌క్క‌డంతో అక్క‌డ క‌మ్మ కుల ఆగ‌డాలు సాగ‌డం లేదు. దీంతో స‌ద‌రు ప‌త్రిక ప్ర‌త్యేకించి విషం చిమ్మే క‌థ‌నాలు ప్ర‌చురిస్తూ ఎటాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక‌పోతే నెల్లూరు నుంచి మంత్రి నారాయ‌ణ లాంటి కాపునేత ఆ జిల్లాని ఒక కొమ్ము కాసేస్తాడ‌ని, తేదేపా నాయ‌కుడి బ‌లం ముందు ఎవ‌రూ స‌రిపోర‌ని స‌ద‌రు క‌థ‌నంలో రాసుకొచ్చారు. అలానే ప‌వ‌న్ రాజ‌కీయ రొట్టె ప‌ట్టుకుంటాడా? అంటూ వ్యంగ్యాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం స‌ద‌రు ప‌త్రిక‌ చేసింది. మొత్తానికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో తొక్కించుకునే లేదా నిషేధాజ్ఞ‌ల‌కు గుర‌య్యే క‌థ‌నాల‌తో మ‌రోసారి స‌ద‌రు క‌మ్మ ప‌త్రిక జులుం ప్ర‌ద‌ర్శించ‌డం జ‌న‌సేన వ‌ర్గాల్లో సీరియ‌స్‌గానే చ‌ర్చ‌కొస్తోంది. ఇలాంటి క‌థ‌నాల‌తో కాపుల్లో కుల కుంప‌టి ర‌గిలిస్తున్న ఈ ప‌త్రిక… అటు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపైనా ఇంత‌కంటే దారుణ‌మైన క‌థ‌నాలు రాస్తుండ‌డంపైనా ఆ సామాజిక వ‌ర్గం చాలానే సీరియ‌స్‌గా ఉందన్న టాక్ వినిపిస్తోంది.