అక్కడ అడుగుపెడితే ఐలయ్య అరెస్టే..144 సెక్షన్

Thursday, October 26th, 2017, 11:39:01 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు రాజకీయాలు గొడవలు ఉపందుకుంటే మారో వైపు ఐలయ్య వివాదం కూడా తార స్థాయికి చేరుతోంది. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకంతో కంచ ఐలయ్య వివాదాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చిన్నదే అనుకున్నారు. కానీ విషయం సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లడంతో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియాల్లో కూడా ఈ విషయంపై రోజుకో న్యూస్ వెలువడుతోంది. అయితే ఈ వివాదం మరింత ఉద్రిక్తం కానుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఐలయ్య కు సన్మానం జరిపేందుకు బహుజన వర్గాలు సిద్ధమవుతున్నాయి.

ఈ నెల 28వ తేదీన విజయవాడలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. మరో వైపు ఆర్యవైశ్యులు అలాగే బ్రాహ్మణులు కూడా ఆత్మీయ సభలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు పోలీసులను అనుమతి కుడా కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఎవ్వరికి అనుమతులు ఇచ్చేది లేదని గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. ఇక కంచె ఐలయ్య విజయవాడలో అడుగుపెడితే పోలీసులు అరెస్ట్ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవ్వరికి అనుమతులు ఇచ్చేది లేదని సభాలను నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెబుతూ.. ఎటువంటి సభలను నిర్వహించినా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments