అవును కన్నా.. నిజంగానే మోడీ గిఫ్ట్ మర్చిపోలేం !

Sunday, February 10th, 2019, 11:58:07 AM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నోటికి పని చెప్పారు. మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మోడీ ఇచ్చిన హామీలని పక్కనబెట్టి మిగిలిన వాటిని హక్రాచాలు తెచ్చి మోడీ ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోలేనిది కొనియాడారు. ఏపీ జనం మోడీకి మద్దతు పలికింది హోదా ఇస్తారని, అదనపు నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆడుకుంటారని. యువత అయితే ఉపాధి అవకాశాల కల్పన గణీయంగా పెరుగుతుందని మోదీకి జైకొట్టారు.

కానీ మోడీ చేసింది మొండి చేయి చూపించడం. హోదా అడిగితె ప్యాకేజీ ఇస్తామని నమ్మబలికి, ఆ తరవాత అది కూడా లేకుండా చేశారు. ఇక వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం ఏటా ఇచ్చే 350 కోట్లను కూడా గతేడాది వెనక్కు లాక్కుంది. ఉక్కు కర్మాగారానికి నిధులు లేవు, రైల్వే జోన్ ఊసే ఎత్తడంలేదు. కానీ పోలవగరానికి నిధులిచ్చారు, గన్నవరం విమానాశ్రయం, విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఫ్లైఓవర్లు అంటూ వేరే లెక్కలు చెప్పుకుంటూ పోతున్నారు.

అంతేకాని నెరవేరుస్తామని చెప్పిన, నెరవేర్చాలని జనం అడుగుతున్న హామీలను ప్రస్తావించడంలేదు. ఇక సభలో మాట్లాడటం మొదలుపెట్టిన మోడీ గుంటూరు జిల్లాను పొగుడుతూ గ్యాస్ కనెక్షన్లు, లోకల్ ప్రాజెక్టులు, కాలుష్యరహిత నవ భారత నిర్మాణం అంటూ హామీలను గుప్పిస్తున్నారు.