ప్రభుత్వ ధనాన్ని దోచుకోడం ఇక ఆపవా చంద్రబాబు..?

Wednesday, September 12th, 2018, 12:45:52 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీ జనతా పార్టీ ముఖ్య అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కురిపిస్తున్న ప్రశ్నల వర్షం ఆపట్లేదు అన్న విషయం అందరికి తెలిసినదే అయితే ఆయన తన ప్రశ్నలకు బాబు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు వారి దగ్గర సమాధానం లేదా..? అని అడుగుతున్నారు ఐతే ఎప్పటి లాగానే ఈ రోజు కూడా ఆయన ప్రశ్నల వెల్లువ కురిపించారు. ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ వారు చేపట్టిన టెండరును దక్కించుకుంటే దాన్ని ఎందుకని రద్దు చేశారో స్పష్టత ఇవ్వాలని తెలియజేసారు.

అంతే కాకుండా భోగాపురం విమానాశ్రయాల టెండర్లు రద్దు పై సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలకు, కార్యకలాపాలకు ప్రభుత్వ ఆడిటోరియంలు ఎందుకని ఉపయోగిచకుండా ప్రైవేట్ వారికి సంబందించిన ఫంక్షన్ హాళ్లుకి వారి సంబంధిత మానేజ్మెంటుకి ప్రభుత్వ సొమ్ముని ఎంత ఎంత ధారబోస్తున్నారని అందులో మీ ఖజానాకు ఎంత వెళ్తుంది అన్నట్టుగా వివరించారు. అంతే కాకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో ఏదైనా చిన్నపాటి వాన కురిస్తేనే లోపల నీరు కారిపోతుంది అని అంత ఖర్చు పెట్టి నిర్మించిన భవంతి అలా అవ్వడానికి గల కారణాల మీద కూడా విచారణ చెయ్యాలి అని సూచించారు. వీరి ప్రభుత్వం లో మహిళా అధికారుల పట్ల దాడులు అధికం అయ్యాయి అని వీరికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు అని ఎద్దేవా చేశారు..

  •  
  •  
  •  
  •  

Comments