ఆ క్రెడిట్ కూడా బాబుదే నా…? – కన్నా…!

Thursday, November 1st, 2018, 04:10:21 PM IST

ప్రపంచంలో ఏ మూల ఎం జరిగిన దానికి క్రెడిట్ తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటం చూస్తూనే ఉన్నాం, ఇటీవల మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ ఘనత కూడా బాబుకే దక్కుతుందంటూ కన్నా లక్ష్మి నారాయణ. ప్రతీ వారం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాసే అయన తాజాగా బాబుకు 18వ లేఖ రాశారు. ప్రతి లేఖలో మాదిరిగానే ఈ లేఖలో కూడా 5 ప్రశ్నలు బాబుకు సంధించారు కన్నా. మానవ హక్కుల కమీషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో అక్రమ రవాణాకు గురవుతున్న మహిళల్లో 26 శాతం మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే అని అయన పేర్కొన్నారు.

తిత్లీ తుఫాన్ కోసం నేషనల్ డిజాస్టర్ మానేజ్మెంట్ నిధులు తీసుకొని కూడా కేంద్రం సహాయం చేయలేదంటూ చంద్రబాబు నిందించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోలవరం ముంపు భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమంగా 650 కోట్లు కాజేయలేదా అన్నారు, అమరావతి డిజైన్ విషయంలో 90కోట్ల ఒప్పందం వెనక రహస్యం ఏమిటని అయన ప్రశ్నించారు. అగ్రి గోల్డ్ వ్యవహారం లో దర్యాప్తు సంస్థలను కోర్టు తప్పుపట్టలేదా అంటూ కన్నా లక్ష్మి నారాయణ చంద్రబాబుకు రాసిన లేఖలో ఐదు ప్రశ్నలు సంధించారు.