పరిపూర్ణానందకు మద్దతుగా కన్నా ట్వీట్స్ !

Wednesday, July 11th, 2018, 12:59:50 AM IST


ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ప్రజలు సహా కొందరు ప్రముఖులు కూడా మహేష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ, కత్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై స్పందించిన స్వామి పరిపూర్ణానంద స్వామి, కత్తి మహేష్ వంటి వ్యక్తులకు తాము చేసిన తప్పు తమకు తెలిసేలా చేస్తామని, అది గొడవలతో, దాడులతో కాదని, శాంతి యుతంగా వారే తప్పును తెలుసుకునేలా చేస్తామని అన్నారు. కాగా నిన్న కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, పాదయాత్ర చేపట్టడానికి సిద్దమైన ఆయనని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ విషయమై నేడు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ స్పందిస్తూ, పరిపూర్ణానందను అరెస్ట్ చేయడం ఘోరం, అన్యాయమని సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. అంతే కాదు, ఆయన ఏమైనా నేరం చేశారా, ఆయన్ని అరెస్ట్ చేసిన జులై 9న బ్లాక్ డే గా అభివర్ణించారు. అలా ఒక మతం వారిని కించపరిచిన వ్యక్తిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంట్లోనే బంధించడం ఈ ప్రభుత్వానికి ఎంతైనా మంచిది కాదని ఆయన అన్నారు. అసలు ఇకపై ఎవరైనా సరే, ఏదైనా మతాన్ని తక్కవ చేసి, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే, వారికి కఠిన రీతిన శిక్షలు అమలు చేయాలనీ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కాగ్ కన్నా చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి…..

  •  
  •  
  •  
  •  

Comments