డిసెంబర్ 6 డెడ్ లైన్.. బాబు, పవన్, జగన్ వాట్ నెక్స్ట్..?

Sunday, October 15th, 2017, 11:40:52 PM IST

కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మనాభంకు, ప్రభుత్వానికి మధ్య పోరు జరుగుతూనే ఉంది. ఆయన ఉద్యమించాలి అని ప్రయత్నించినపుడల్లా ప్రభుత్వం ముద్రగడని గృహ నిర్బంధం చేస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ తలపెట్టిన పాదయాత్ర కూడా విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమాన్ని మరో మారు ఉదృతం చేయాలని ముద్రగడ భావిస్తున్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. డిసెంబర్ 6 లోపు కాపు రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని ముద్రగడ హెచ్చరించారు.

అన్ని కులాలు అనుభవిస్తున్న 49 శాతం రిజర్వేషన్లలో తమకు వాటా వద్దని, 51 శాతంలో రిజర్వేషన్లలో వాటా కావాలని డిమాండ్ చేసారు. ముద్రగడ డిమాండ్ తో ప్రభుత్వం డిఫెన్స్ లో పడినట్లయింది. ఇప్పటివరకూ ఎలాగో ముద్రగడ అంశాన్ని బాబు అణచి వేశారు. కానీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ సమస్యని ఎలా అధికమిస్తారనేది ప్రశ్నగా మారింది. రిజర్వేషన్లు ఆశించే ఓ వర్గం కాపులు ముద్రగడ వైపు ఉన్నారనేది వాస్తవం. టీడీపీ లో కాపు సామాజికవర్గానికి చేసిన నేతలు చాలా మందే ఉన్నారు. వారిపై ఒత్తిడి పెరిగితే సాధారణంగానే చంద్రబాబుపై కూడా ఒత్తిడిపై పెరుగుతుంది.

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ని వద్దన్నా ఈ ఇష్యూ లోకి లాగేవారు ఉన్నారు. ఎందుకంటే పవన్ కాపు సామజిక వర్గానికి చెందిన వాడే కాబట్టి. కులాలకు అతీతంగా జనసేన పార్టీ పని చేస్తుందని పవన్ కళ్యాణ్ చెబుతున్నా అది ఎంతవరకు సాధ్యం అనేది రాజకీయ వర్గాల్లో కలుగుతున్న అనుమానం. పవన్ సొంత సామజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోందని లోలోపల రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాపులది అతిపెద్ద ఓట్ బ్యాంక్. తన సొంత సామజిక వర్గానికి వ్యతిరేకంగా ప్రకటన చేసి ఓట్ బ్యాంకుని వదులుకునే సాహసం పవన్ చేస్తాడా ? అది అంత సులువు కాదు. కాపు రిజర్వేషన్ ల ఇష్యూలో పవన్ చేసే ప్రకటనపైనే ఉద్యమ తీవ్రత ఆధార పడి ఉంటుంది.

ఇక ఈ అంశంలో జగన్ పాత్ర ప్రత్యేకమైనది. ఇప్పటికే ముద్రగడని జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలు తెలుగు దేశం పార్టీ చేస్తోంది. ముద్రగడ పట్ల జగన్ సానుకూలంగానే ఉన్నారు. రాబోవు రోజుల్లో ముద్రగడని బలపరిచే నేపథ్యంలో జగన్ కు కూడా పరోక్షంగా లాభించే అవకాశం ఉంది. కాపు ఓట్లని వైసిపి వైపు తిప్పుకోవడానికి జగన్ కు ఉన్న అవకాశం ఇది. ముద్రగడ ఉద్యమ తీవ్రత పెరిగితే కాపులకు జగన్ అనుకూలంగా ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తే టీడీపీ ఇరుకున పడ్డట్లే.

  •  
  •  
  •  
  •  

Comments