జనసేన పవన్ కి వార్నింగ్ ఇచ్చిన కాపునాడు

Friday, April 20th, 2018, 11:30:40 AM IST

పవన్ కళ్యాణ్ వైఖరి పై కాపునాడు తీవ్రంగా స్పందించింది… మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు, ఢిల్లీకి లొంగిపోవటం పై, తీవ్రంగా స్పందించింది… మాకు కులం ముఖ్యం కాదని, రాష్ట్రం ముఖ్యమని, ఇప్పటికైనా పవన్ మారాలని పవన్ కు తలంటింది… విభజన హమీల కోసం, మోడీ లాంటి బలమైన నేతతో చంద్రబాబు యుద్ధం చేస్తుంటే, ఆయానకు రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తున్నారని, చంద్రబాబు తప్ప ఏ నాయకుడు ఢిల్లీతో పోరాటం చెయ్యటం లేదు కదా అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది…

చంద్రబాబు పోరాటాన్ని కాపులు అందరూ సహకరిస్తాం అని, అలా కాదని చంద్రబాబుని మన వాళ్ళే బలహీన పరిస్తే ఎలా అంటూ నిలదీసింది… చంద్రబాబుని బలహీన పరిస్తే ఎలా అంటూ, పవన్ కళ్యాణ్ ను నిలదీసింది… రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇప్పటికైనా మోడీతో పోరాటం చెయ్యాలని పవన్ ను కోరింది.. బీజేపీ భావలాని పవన్ వకాల్తా పుచ్చుకోవటం ఆశ్చర్యం అని అంటుంది… ఇప్పటికే ఒకసారి చిరంజీవి రూపంలో అవమానాలు పొందామని, మళ్ళీ మీరు అదే తప్పు చేసి, మన సామాజిక వర్గం పరువు తియ్యవద్దు అని పెర్కుంది…

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్… ఇక్కడ ప్రతి ఒక్కరు మన రాష్ట్ర అభివృద్ధి కోసమే చూస్తున్నారు… కులాలు, మతాలూ, ప్రాంతాలు ఇక్కడ అప్రస్తుతం… ఒక ఢిల్లీ పార్టీ ఎలా ముంచిందో, మరో ఢిల్లీ పార్టీ ఎలా మోసం చేస్తుందో చూసి, ఆంధ్రోడు రగిలిపోతున్నాడు.. ఆ ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలని, వారు కుళ్ళుకునేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోతుకుంటున్నారు… దీని కోసమే, మనకు అన్యాయం చేస్తున్న ఢిల్లీ పై చంద్రబాబు పోరాడుతుంటే, ప్రతి ఒక్కరు ఆయన వైపు నిలుస్తున్నారు… ఇప్పటికైనా జగన్, పవన్, లాలూచి పనులు మాని, రాష్ట్రం కోసం పోరాడాలి..

  •  
  •  
  •  
  •  

Comments