ప్ర‌కాశం జిల్లా బ్లాస్టింగ్.. టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి క‌ర‌ణం బ‌ల‌రాం..?

Wednesday, November 7th, 2018, 01:23:13 PM IST

ఏపీ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల ర‌చ్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఉన్న అసంతృప్త‌ నేత‌లు త‌మ భ‌విష్య‌త్తు పై కార్యాచ‌ర‌ణ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌కాశం జిల్లాకు సంబందించిన ఒక వార్త రాజ‌కీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ బ‌ల‌రాంకి సొంత పార్టీలోనే ఘోర అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. ఎప్పుడైతే గొట్టిపాటి ర‌వి వైసీపీ నుండి టీడీపీలోకి వ‌చ్చాడో అప్ప‌టి నుండి బ‌ల‌రాం బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది.

ఇక తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా బ‌ల‌రాంని తాజాగా ఒంగోలులో నిర్వ‌హించి స‌మావేశం నుండి బ‌య‌ట‌కు పొమ్మ‌నడంతో ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌ల‌కే తావిచ్చింది. దీంతో ఆ అవ‌మానం బ‌ల‌రాం త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో బ‌ల‌రాం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే గ‌త ఏడాది నుండి బ‌ల‌రాం వైసీపీ వైపు చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే ఈమధ్యే ప్ర‌కాశం జిల్లా వైసీపీ ఇంచార్జ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డితో బలరామ్ కొడుకు కరణం వెంకటేష్ భేటీ అయ్యారు. దీంతో ప్ర‌స్తుత తాజా ప‌రిస్థితులు చూస్తుంటే.. ఈ టీడీపీ సీనియ‌ర్ నేత తొందరలో వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చలు మొద‌ల‌య్యాయి. మ‌రి చ‌ర్చ‌ల విష‌యం ప‌క్క‌న పెడితే ఎన్నిక‌లు సమీపిస్తున్న త‌రుణంలో బ‌ల‌రాం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.