వైరల్ అవుతున్న వింత జీవి వీడియో..నిజమేనా?

Tuesday, June 5th, 2018, 10:43:05 PM IST

సోషల్ మీడియా వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ నిజమేదో అబద్దం ఎదో తెలియక కొన్ని సంఘటనలు అనుమానాలను కలిగిస్తున్నాయి. ఫెక్ అని తెలిశాక మరో నిజాన్ని కూడా నమ్మలేని పరిస్థితి. కానీ చాలా వరకు సోషల్ మీడియాలో అబద్దాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక లో ఏలియన్ సంచరిస్తోంది అంటూ వాట్సాప్ ఫెస్ బుక్ లలో ఏలియన్ కి సంబందించిన పేర్లతో వీడియోను షేర్ చేస్తున్నారు.

తెల్లని ముఖంతో ఉన్న ఆ ఒక వింత జీవి రాత్రుళ్లు ముగ జీవులపై దాడికి దిగుతోంది అని, కొన్ని రోజుల తరువాత మూగ జీవులు మరణిస్తున్నాయని స్థానికులు వాబోతున్నారు. ఇటీవల తాడుతో దాన్ని కట్టేసి ఉన్నట్లు ఒక వీడియో జనాలను ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అయితే కొంత మంది మాత్రం అది ఏలియన్ ఒకదాని ఒక కోతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోతికి ఒక తెలుగు రంగు పూసి విచిత్రంగా తాయారు చేశారని అదంతా ఫెక్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.