కర్ణాటక ఎన్నికల్లో ఉద్రిక్తత… గాయాలపాలైన ఇరు పార్టీ వర్గాలు

Sunday, May 13th, 2018, 04:40:25 AM IST

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల విషయం దేశంలో పెద్ద చర్చానీయాంశం అయింది. ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికల విషయమే వినపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలు ఊపందుకుంటున్న తరణంలో తుముకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది, పోలింగ్ జరుగుతున్న చోటులోనే అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇటు భాజాపా కార్యకర్తలు పరస్పర దాడులు జరుపుకున్నారు. విజయనగరంలో నియోజకవర్గంలో ఈరెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాదామిలో టౌన్ పోలిస్ స్టేషన్ వద్ద ఇరు పార్టీల నాయకులు ఓడవకి దిగారు. దేబ్బలపాలైన రెండు పార్టీల కార్యకర్తలను దగ్గరలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు పార్టీల నాయకులను చెదరగొట్టి గొడవను సర్దుమనిచారు.

ఇదిలా ఉంటే హంపీనగర్ లో భాజాపా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్టుండి బాహాబాహీకి దిగారు. తమ మునిసిపాల్ కార్పోరేటర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేసి తమను తరిమేసే ప్రయత్నం చేసారని భాజాపా పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. కాగా మళ్ళీ ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన కొద్దిసేపటిలోనే పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఇక్కట్లు పెట్టాయి. కొన్ని కేంద్రాల్లో అసలు ఓటర్ల పేర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ అసహనానికి లోనయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments