నేను సీఎం అవ్వడం మా నాన్నకు ఇష్టం లేదు: కర్ణాటక సీఎం

Tuesday, June 12th, 2018, 08:28:56 AM IST

ఈ ఏడాది రాజకీయాల్లో అందరిని ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏదైనా ఉందా అంటే అది కర్ణాటక ఎన్నికలనే చెప్పాలి. ఊహించని విధంగా బీజేపీ నుంచి జెడిఎస్ కు అధికారం దక్కింది. మధ్యలో ఉన్న కాంగ్రెస్ వేసిన ఎత్తులు మొత్తానికి ఫలించాయి. ఇక జేడీఎస్ – కాంగ్రెస్ కూటమిలో అప్పుడే అంతర్యుద్ధాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో తప్పకుండా వివాదాలు వస్తాయని ముందే బీజేపీ తెలిపింది. అయితే ఇంకా జేడీఎస్ – కాంగ్రెస్ నేతల్లో అలకలు ఉన్నట్లుగానే టాక్ వస్తోంది.

అసలు విషయంలోకి వస్తే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామి ఎవరు ఊహించని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు తాను ముఖ్యమంత్రి అవ్వాలనే కొరికి తన తండ్రి దేవా గౌడకు లేదని ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం వలనే కాంగ్రెస్ నేతలను సీఎం పదవి తీసుకొమ్మని చెప్పినట్లు తెలియజేశారు. రెండు సార్లు గుండెకి సంబందించిన ఆపరేషన్ కావడం వల్ల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాను కూడా కొంత వెనుకడుగు వేసినట్లు తెలిపారు. అయినా కూడా కాంగ్రెస్ నేతల ఇష్టపూర్వకంగానే జేడీఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అవినీతి నిర్ములన చేయమని చాలా మంది కోరుతున్నారు అది అంత సులువు కాదు. అలా చేస్తే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తారు. పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చు. కానీ ముల్లును ముల్లుతోనే తీయాలి. ఆ దిశగా కొనసాగనున్నట్లు కుమారస్వామి తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments