మోడీని పొగిడి సారి చెప్పిన సీఎం!

Tuesday, May 8th, 2018, 05:48:38 PM IST

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే నేతల్లో తెలియని ఆందోళన ఉంటుంది. అందులో భాగంగానే ప్రచారాల్లో అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటారు. ఇదే తరహాలో కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా జరిగింది. ఏకంగా సీఎం సిద్దరామయ్య పొరపాటు బడటం హాట్ టాపిక్ గా మారింది. అదికూడా నరేంద్ర మోడీపై ప్రశంసలు గుప్పించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ప్రచార సభలో తన పార్టీ నేత నరేంద్ర స్వామి ని పొగడబోయిన సిద్దరామయ్య పొరపాటున నరేంద్ర మోడీ అనిప్రశంసలను కురిపించారు.

వెనుకబడిన జిల్లాలో త్రాగు నీరు రోడ్లు అలాగే ఇళ్ల నిర్మాణం వంటి పనులు నరేంద్ర మోది మరియు తమ ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పడంతో మొన్నటి వరకు మోడీ మీద విమర్శలు చేసిన సిద్దరామయ్య ఇలా మాట్లాడుతున్నారు ఏమిటని అంతా అనే లోపే నాలుక కరచుకొని సారి సారి నరేంద్ర స్వామి అని అందరూ గుర్తుంచుకోవాలని అందరికి ఒక డైలాగ్ వదిలారు. స్వామి ఎప్పుడు ఇక్కడే ఉన్నారు. మోదీ మాత్రం గుజరాత్‌లో.. నరేంద్ర మోదీ ఫిక్షన్‌ అయితే నరేంద్ర స్వామి నిజం అని ప్రజలను ఆకర్షించే విధంగా సిద్దరామయ్య సమాధానం ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments