బహిరంగ సభలో కునుకు తీస్తున్న కర్ణాటక సీఎం

Monday, April 30th, 2018, 06:39:27 PM IST

కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాలబురిగిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్య కునుకు తీస్తూ మీడియా కంట పడ్డారు. సీఎం పక్కనున్న ఓ లీడర్ సిద్ధరామయ్యతో మాట కలపడంతో.. ఆయన మేలుకున్నారు. మళ్లీ ఆవలింతలు చేస్తూ.. నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేశారు. సిద్ధరామయ్య నిద్రపై పలువురు నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. సిద్ధరామయ్య నిద్ర కోసమే పుట్టాడని పలువురు విమర్శించారు. గతంలో అసెంబ్లీలో, పలు సభల్లో నిద్ర పోయిన ఫోటోలను నెటిజన్లు షేర్ చేశారు. పడక పడక ఆయన మీడియా కంట పడటంతో విషయం రచ్చ అయింది. దీని పట్ల కాంగ్రెస్ నాయకులు రాష్ర్ట పాలనలో విశ్రాంతి కూడా దొరకదు అలాంటప్పుడు ఒక్కోసారి శరీరం సహకరించకపోవడం వల్ల అలా జరుగుతుంది అంత మాత్రాన ఇంత చిన్న విషయాన్ని రాద్దాంతం చేసి రచ్చ చేయడం మీడియాకు సమంజసం కాదంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.

  •  
  •  
  •  
  •  

Comments