యూపీ సీఎం యోగి కాదు బోగి: దినేశ్ గుండూ రావు

Monday, April 16th, 2018, 11:10:16 AM IST

ఇటివల కతువా లైంగిక దాడి దేశంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొల్పింది. అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండూ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటకకు వచ్చినప్పుడు చెప్పులతో కొట్టాలన్నారు. ఉన్నావ్, కతువా లైంగికదాడి బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకకు వచ్చి ప్రజలకు నీతులు చెబుతున్న యూపీ సీఎం యోగి ఓవేషధారి.. అబద్ధాలకోరు.. ఆయన్ను అడుగుపెట్టనివ్వొద్దు.

ఆయన యోగి ఆదిత్యనాథ్.. కాదు.. యోగి అని పలుకనవసరం లేదు. అతనొక సీఎం పదవిలో ఉన్న భోగి రాష్ట్రంలోకి వస్తే చె ప్పులతో కొట్టి పంపండి అని అన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక సీఎంను కించపర్చడం తగదన్నది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గుండూరావు స్పందిస్తూ ఏదో భావోద్వేగంతో మాట్లాడానని, ఆయన వస్తే చెప్పులు చూపాలని మాత్రమే అన్నానన్నారు. ఈ అంశంపై బీజేపీ వైఖరి ఏమీ బాగోలేదన్నారు. ముందు గరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు, అంతే గానీ అనవసరమైన విషయాలకు చర్చలు పెట్టి సమస్యను తప్పుదోవ పట్టించకుండా చూడాలన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments