కర్ణాటక ఎలక్షన్స్ : ఓటు వేయడంలో స్పీడ్ చూపించిన క్రికెటర్స్

Saturday, May 12th, 2018, 03:30:14 PM IST

కర్ణాటకలో ఫైనల్ గా ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. వచ్చే 2019 ఎన్నికలకు ఈ ఎలక్షన్స్ సెమి ఫైనల్ లాంటిది కావడంతో ప్రచారంలో కాంగ్రెస్ చాలా కష్టపడింది. ఎలాగైనా గెలవాలని అన్నిబ్ స్థానాల్లో ప్రచారం బాగానే చేసింది. బీజేపీ కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రచారం చాలా స్ట్రాంగ్ గా చేసింది. అలాగే అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇరు పార్టీలు సభలలో ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా సెలబ్రెటీలు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని చెప్పడంతో ముందుగా క్రికెటర్లు కదిలారు.

అందరికంటే ముందుగా సీనియర్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే సెల్ఫీ దిగి సోషల్ మీడియా లో ఓటు వేయడం మన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులోతో ఓ స్థానిక బూత్ దగ్గరికి వెళ్లిన కుంబ్లే క్యూ లో నిలబడి అక్కడే ఓటు వేశారు.
ఓటు వేసిన తరువాత సిరా గుర్తును చూపిస్తూ మళ్లీ మరో సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫొటో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments